ప్రజా క్షేత్రంలో ప్రసన్నను బహిష్కరించాలి
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి డిమాండ్
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( జూలై పున్నమి)
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ల మధ్య నెలకొన్న పోరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉలిక్కి పడేలా చేసింది.
నాటి రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించిన స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన ప్రసన్న సీనియర్ శాసనసభ్యుడు గా మాజీ మంత్రి గా అందరికీ సుపరిచితమే. నేటి రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్న యమ్ .పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తో ప్రసన్న పోరు ఎన్నికల అనంతరం సద్దుమణిగాయని అనుకున్నా నివురుగప్పిన నిప్పులా ఉందనేది తాజా సంఘటనలతో రుజువైంది. ప్రశాంతి రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయ్యాక ఆమె తన పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలకు చెక్ పెట్టేలా బహిరంగ సభలో తాను ఎవరు.. ఏమిటి.. ఇప్పుడు ఇలా రావడానికి కారణం వివరిస్తూ ప్రత్యర్థి వర్గాలకు అందరూ ఆశ్చర్య పోయేలా చెక్ పెట్టి, ప్రసన్న పై విజయం సుసాధ్యం అని నిరూపించారు. గత ఏడాది కాలంగా ప్రసన్న కూడా స్థానిక రాజకీయాలలో ఆంటీ అంటన్నట్లు ఉంటూ హైదరాబాద్ లో నివాసం నిర్మాణం లొ బిజీ గా ఉండి పోయారు. అయితే
కొన్ని రోజులు గా తన విమర్శల జోరు పెంచిన నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ప్రసన్న ఇంటి పై దాడి అందరూ ఉలిక్కిపడేలా చేసింది.
ఈ దాడి తీవ్రత పరిణామాలు తీసుకునే మలుపులు ఏమో కానీ
సీనియర్ నేత గా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కోల్పోయిన క్రమం లో ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.
రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తనను అసభ్య పదజాలంతో దూషించారని. ప్రశాంతి రెడ్డి. జిల్లా అడిషనల్ ఎస్ పి సి హెచ్ సౌజన్యని కలిసి ప్రసన్న అనుచిత వాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాను ప్రసన్న హయాంలో జరిగిన గ్రావెల్ దోపిడి, అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు. ఆయన అవినీతి అక్రమాలు ఇక చెల్లవంటూ కోవూరు ప్రజానీకం ఛీ కొట్టి శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి వెలివేశారని. సంస్కార రహితంగా మాట్లాడే ప్రసన్న పై చట్టపరంగా ఎదుర్కుంటానన్నారు.
ఇరువురికి ఉన్న బంధుత్వాల నేపథ్యంలో ప్రశాంతి.ప్రసన్నల మధ్య రాజకీయ పోరు ఏమి కాబోతున్నది అన్నది ఉత్కంఠత కలిగిస్తోంది. చంద్రబాబు, లోకేష్ ల పై కూడా ప్రసన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన క్రమం లో ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు.
ప్రజా క్షేత్రంలో ప్రసన్నను బహిష్కరించాలి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి డిమాండ్
ప్రజా క్షేత్రంలో ప్రసన్నను బహిష్కరించాలి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి డిమాండ్ జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( జూలై పున్నమి) కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ల మధ్య నెలకొన్న పోరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉలిక్కి పడేలా చేసింది. నాటి రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించిన స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన ప్రసన్న సీనియర్ శాసనసభ్యుడు గా మాజీ మంత్రి గా అందరికీ సుపరిచితమే. నేటి రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్న యమ్ .పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తో ప్రసన్న పోరు ఎన్నికల అనంతరం సద్దుమణిగాయని అనుకున్నా నివురుగప్పిన నిప్పులా ఉందనేది తాజా సంఘటనలతో రుజువైంది. ప్రశాంతి రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయ్యాక ఆమె తన పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలకు చెక్ పెట్టేలా బహిరంగ సభలో తాను ఎవరు.. ఏమిటి.. ఇప్పుడు ఇలా రావడానికి కారణం వివరిస్తూ ప్రత్యర్థి వర్గాలకు అందరూ ఆశ్చర్య పోయేలా చెక్ పెట్టి, ప్రసన్న పై విజయం సుసాధ్యం అని నిరూపించారు. గత ఏడాది కాలంగా ప్రసన్న కూడా స్థానిక రాజకీయాలలో ఆంటీ అంటన్నట్లు ఉంటూ హైదరాబాద్ లో నివాసం నిర్మాణం లొ బిజీ గా ఉండి పోయారు. అయితే కొన్ని రోజులు గా తన విమర్శల జోరు పెంచిన నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ప్రసన్న ఇంటి పై దాడి అందరూ ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి తీవ్రత పరిణామాలు తీసుకునే మలుపులు ఏమో కానీ సీనియర్ నేత గా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కోల్పోయిన క్రమం లో ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తనను అసభ్య పదజాలంతో దూషించారని. ప్రశాంతి రెడ్డి. జిల్లా అడిషనల్ ఎస్ పి సి హెచ్ సౌజన్యని కలిసి ప్రసన్న అనుచిత వాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాను ప్రసన్న హయాంలో జరిగిన గ్రావెల్ దోపిడి, అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు. ఆయన అవినీతి అక్రమాలు ఇక చెల్లవంటూ కోవూరు ప్రజానీకం ఛీ కొట్టి శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి వెలివేశారని. సంస్కార రహితంగా మాట్లాడే ప్రసన్న పై చట్టపరంగా ఎదుర్కుంటానన్నారు. ఇరువురికి ఉన్న బంధుత్వాల నేపథ్యంలో ప్రశాంతి.ప్రసన్నల మధ్య రాజకీయ పోరు ఏమి కాబోతున్నది అన్నది ఉత్కంఠత కలిగిస్తోంది. చంద్రబాబు, లోకేష్ ల పై కూడా ప్రసన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన క్రమం లో ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు.