*ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి.*
*హోలీ పండుగ రోజున వైన్ షాపులు,బార్ల మూసివేత.*
*సీపీ జి.సుధీర్ బాబు,ఐపీస్ ఆదేశాలు జారీ.*
ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – సురక్ష ప్రతినిధి
తేదీ: మార్చి 02, 2026.
హోలీ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకునేలా సంబంధిత శాఖ అధికారులకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, IPS గారు ఆదేశాలు జారీ చేశారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (Toddy Shops) మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు 03.03.2026 (మంగళవారం) ఉదయం 06:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు మూసివేయబడతాయి.
అయితే స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు ఈ ఆదేశాలు వర్తించవు.
ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలని భావించి, తెలంగాణ ఎక్సైజ్ చట్టం – 1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.



