Thursday, 5 February 2026
  • Home  
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుఫాను కారణంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం ఆర్డివో కొత్త మాధవి తెలిపారు. ఆదివారం సఖినేటిపల్లి మండలం లోని తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. కేశవ దాసుపాలెం, పల్లిపాలెం గ్రామాలలో గల తుఫాను ఆశ్రమ భవనాలను స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలో నివసించే వారిని సోమవారం మధ్యాహ్ననానికి తుఫాను ఆశ్రమ భవనాలకు, లేదా అధికారులు గుర్తించిన ప్రదేశాలలో ఆశ్రమం పొంది అధికారులకు సహకరించాలని ఆమె తెలిపారు. రానున్న తుఫాను తీవ్రత దృష్ట్యా, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మొంథా తుఫాన్ తీవ్రత కారణంగా సముద్రం ఆలోకల్లోలంగా ఉంటుందని అంతర్వేది పల్లెపాలెం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆమె సూచించారు. సఖినేటిపల్లి మండల తహసీల్దార్ ఎం.సత్యనారాయణ, రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్, ఎస్సై దుర్గా శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఒడుగు శ్రీను, మాజీ సర్పంచ్ మూలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.