Monday, 8 December 2025
  • Home  
  • పోలూరు గ్రామంలో చెత్తాచెదారులతో నిండిన మురికి కాలువలు సంవత్సరాల్లో కానరాని పరిశుభ్రత…
- E-పేపర్

పోలూరు గ్రామంలో చెత్తాచెదారులతో నిండిన మురికి కాలువలు సంవత్సరాల్లో కానరాని పరిశుభ్రత…

నంద్యాల జిల్లా నంద్యాల మండల పరిధిలోని పోలూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అలాగే గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల దగ్గర పిచ్చి మొక్కలతో, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా గత రెండేళ్ల నుండి మురికి కాలువలను పరిశుభ్రం చేయకపోవడంతో కాల్వల్లో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం పోలూరు గ్రామంలో విలేకరుల బృందం పర్యటించినప్పుడు ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది రూపాయల ఖర్చు చేస్తూ ప్రతి మాసం మూడవ శనివారం స్వచ్ఛభారత్ స్వచ్ఛంద్ర నినాదంతో పరిశుభ్రం చేయాలని మరియు గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ పోలూరు గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల వెంట పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ బాటిల్ అలాగే చెత్త చెదారంతో దర్శనమిస్తూ అంటురోగాలు ప్రబలడానికి ఆస్కారం ఉందని దీంతో అధికారులు స్పందించకపోవడం కడు శోచనీయంమని బహిరంగంగా ప్రజలు విమర్శిస్తున్నారు. నంద్యాల మండలంలోని పోలూరు గ్రామంలో సుమారుగా ఐదువేల జనాభా నివాసముంటున్నారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామని అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్, పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంది. అయినా గత మూడు సంవత్సరాల నుండి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్తాచెదారాలతో కాలువలు మూసుకుని పోయాయని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామ సచివాలయం దగ్గర అంగన్వాడి కేంద్రం నిర్వహణలో ఉంది. అక్కడ చదువు కొనసాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులు బయటికి వస్తే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో విషపూరితమైన పురుగులు సంచరిస్తున్నడం తో ప్రమాదవశాత్తు పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సర్పంచు అందుబాటులో ఉండడు శాశ్వత ప్రాతి పాదికన పంచాయతీ కార్యదర్శి లేడు దీంతో గ్రామ సర్పంచ్ అందుబాటు లేకపోవడం గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు పున్నమి కు తెలియజేశారు.కాగా గ్రామ సర్పంచ్ గ్రామంలో లేకపోవడం వల్ల అలాగే పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్ గా లేకపోవడం వారానికి ఒకసారి సర్పంచ్ గ్రామాల్లో ఉండడంవల్ల పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. సచివాలయం దగ్గర వెనుక భాగాన అలాగే అంగన్వాడి సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగి పంట పొలాలను తలపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. అందువల్ల జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని గ్రామ ప్రజలు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

నంద్యాల జిల్లా నంద్యాల మండల పరిధిలోని పోలూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అలాగే గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల దగ్గర పిచ్చి మొక్కలతో, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా గత రెండేళ్ల నుండి మురికి కాలువలను పరిశుభ్రం చేయకపోవడంతో కాల్వల్లో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం పోలూరు గ్రామంలో విలేకరుల బృందం పర్యటించినప్పుడు ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది రూపాయల ఖర్చు చేస్తూ ప్రతి మాసం మూడవ శనివారం స్వచ్ఛభారత్ స్వచ్ఛంద్ర నినాదంతో పరిశుభ్రం చేయాలని మరియు గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ పోలూరు గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల వెంట పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ బాటిల్ అలాగే చెత్త చెదారంతో దర్శనమిస్తూ అంటురోగాలు ప్రబలడానికి ఆస్కారం ఉందని దీంతో అధికారులు స్పందించకపోవడం కడు శోచనీయంమని బహిరంగంగా ప్రజలు విమర్శిస్తున్నారు. నంద్యాల మండలంలోని పోలూరు గ్రామంలో సుమారుగా ఐదువేల జనాభా నివాసముంటున్నారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామని అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్, పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంది. అయినా గత మూడు సంవత్సరాల నుండి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్తాచెదారాలతో కాలువలు మూసుకుని పోయాయని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామ సచివాలయం దగ్గర అంగన్వాడి కేంద్రం నిర్వహణలో ఉంది. అక్కడ చదువు కొనసాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులు బయటికి వస్తే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో విషపూరితమైన పురుగులు సంచరిస్తున్నడం తో ప్రమాదవశాత్తు పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సర్పంచు అందుబాటులో ఉండడు
శాశ్వత ప్రాతి పాదికన పంచాయతీ కార్యదర్శి లేడు దీంతో గ్రామ సర్పంచ్ అందుబాటు లేకపోవడం గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు పున్నమి కు తెలియజేశారు.కాగా గ్రామ సర్పంచ్ గ్రామంలో లేకపోవడం వల్ల అలాగే పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్ గా లేకపోవడం వారానికి ఒకసారి సర్పంచ్ గ్రామాల్లో ఉండడంవల్ల పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. సచివాలయం దగ్గర వెనుక భాగాన అలాగే అంగన్వాడి సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగి పంట పొలాలను తలపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. అందువల్ల జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని గ్రామ ప్రజలు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.