Monday, 23 March 2026
  • Home  
  • పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు
- విశాఖపట్నం

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైనట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందు కోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందచేస్తున్నారు. ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశం అయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింద‌ని తెలిపారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాయన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో నుండి సంపూర్ణ రక్షణ అవసరమని 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రతిసారి రెండు చుక్కలు-పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొబ్బరి తోట పిహెచ్సి డాక్టర్ అక్ష పర్వీన్, ఎ. ఎన్. ఎం. కే. విజయలక్ష్మి,ఎ. ఎస్.హెచ్ సి ఎల్.నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ టి. పార్వతి,వాలంటరీ ఎల్. ప్రసన్న అక్షయ,కే. అప్పారావు, వై ఆది బాబు, సిపిఐ బుజ్జి, కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం
— డాక్టర్ కందుల నాగరాజు

*విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*
పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైనట్లు
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.
ఆదివారం అల్లిపురంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందు కోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందచేస్తున్నారు. ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశం అయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింద‌ని తెలిపారు.
పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాయన్నారు.
ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో నుండి సంపూర్ణ రక్షణ అవసరమని 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రతిసారి రెండు చుక్కలు-పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ అని అన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
కొబ్బరి తోట పిహెచ్సి
డాక్టర్ అక్ష పర్వీన్,
ఎ. ఎన్. ఎం. కే. విజయలక్ష్మి,ఎ. ఎస్.హెచ్ సి ఎల్.నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ టి. పార్వతి,వాలంటరీ ఎల్. ప్రసన్న అక్షయ,కే. అప్పారావు, వై ఆది బాబు, సిపిఐ బుజ్జి, కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.