(ముత్తుకూరు పున్నమి ప్రతినిధి, డిసెంబర్ 17):-
డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం పొట్టెంపాడు పంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించినప్పటికీ, ఆ వ్యవస్థ పేద గిరిజనులకు ఉపయోగపడలేదని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ నాయకులు ఏ విధంగా వినియోగించుకున్నారో వారికే తెలియాలన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగంగా పేదల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక గిరిజన కాలనీల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, బోలా అశోక్, సందురి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, దగ్గోలు సుమన్, అక్బర్, గుడి సీనయ్య తదితరులు పాల్గొన్నారు.


