Thursday, 5 February 2026
  • Home  
  • పేద విద్యార్థుల కోసం ఆర్ధిక సాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేద విద్యార్థుల కోసం ఆర్ధిక సాయం

చేజర్ల గ్రామ రిటైర్డ్ టీచర్ లేట్ జి.శ్రీధర్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని స్వర్ణగౌరీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేందుకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఏ.సుబ్బరత్నం ,యం. రవిబాబులకు ఆదివారం అందజేశారు. యు టి ఎఫ్ చేజర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం యుటిఎఫ్ ముద్రించిన మోడల్ టెస్ట్ పేపర్లు ఉచితంగా అందజేయడం వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. స్వర్ణ గౌరీ గారు మండల శాఖకు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మొత్తాన్ని కూడా పేద విద్యార్థుల కొరకు వెచ్చించడం జరుగుతుందని యు టి ఎఫ్ నాయకులు రవిబాబు, సుబ్బరత్నం, ఎన్ రమణయ్య ,ఆర్ వి. కృష్ణారెడ్డి, ఏ.సుబ్రహ్మణ్యం,ఏ వెంకటేశ్వర్లు, ఎన్. బుజ్జయ్య, మస్తాన్ బాషా తెలియజేశారు..

చేజర్ల గ్రామ రిటైర్డ్ టీచర్ లేట్ జి.శ్రీధర్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని స్వర్ణగౌరీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేందుకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఏ.సుబ్బరత్నం ,యం. రవిబాబులకు ఆదివారం అందజేశారు.
యు టి ఎఫ్ చేజర్ల మండల
శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం యుటిఎఫ్ ముద్రించిన మోడల్ టెస్ట్ పేపర్లు ఉచితంగా అందజేయడం వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. స్వర్ణ గౌరీ గారు మండల శాఖకు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మొత్తాన్ని కూడా పేద విద్యార్థుల కొరకు వెచ్చించడం జరుగుతుందని యు టి ఎఫ్ నాయకులు రవిబాబు, సుబ్బరత్నం, ఎన్ రమణయ్య ,ఆర్ వి. కృష్ణారెడ్డి, ఏ.సుబ్రహ్మణ్యం,ఏ వెంకటేశ్వర్లు, ఎన్. బుజ్జయ్య, మస్తాన్ బాషా తెలియజేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.