Thursday, 5 February 2026
  • Home  
  • పేదల కడుపు నింపడం కనీస బాధ్యత
- ఆంధ్రప్రదేశ్

పేదల కడుపు నింపడం కనీస బాధ్యత

అన్నదానం మహాదానమని రెండవ పట్టణ ఎస్ఐ సంతోష్ మంగళవారం అన్నారు. స్థానిక గొంటి వీధి నైట్ షెల్టర్ లో, నిస్సహాయులకు, పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు పొడుగు చరణ్ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్, సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ తదితర బృందం ప్రతినిత్యం ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, సోమవారం రాత్రి అల్పాహారాన్ని నేను అందించటం ఆనందంగా ఉందన్నారు. అన్న సేవకు మించిన సేవ, ఇంకేముంటుందని, పేదవారి కడుపునింపటం గొప్పవిషయమన్నారు. పేదల కడుపునింపటం, కనీస బాధ్యతని ఉన్నదానిలో కొంతభాగం సేవలకు వినియోగించాలన్నారు. అనంతరం షెల్టర్ లో ఉండే నిస్సహాయుల వివరాలను అడిగి, తెలుసుకుని, వరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా షెల్టర్ బాధ్యతను తీసుకున్న చేయూత మేమున్నాం అధ్యక్షురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు పత్రికలలో ఇక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తున్నామని, మన కుటుంబంలో జరిగే వేడుకలను, వేదికగా నైట్ షెల్టర్ ను తీసుకుంటే, వీరి ఆకలి తీర్చినవారమౌతామని, నేను కూడా వీరితో భాగమౌతానన్నారు. ఈ కార్యక్రమంలో నైట్ షెల్టర్ నివాసకులు, నేటి దాతలు పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు పొడుగు చరణ్, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్, సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.