*పేకాట స్ధావరంపై కండలేరు డ్యామ్ పోలీసులు దాడులు*
*ఏడుగురు అరెస్టు , రూ.3160 నగదు స్వాధీనం*
పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులను కండలేరు డ్యామ్ పోలీసులు మంగళవాం పట్టుకున్నారు. కండలేరు డ్యామ్ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు వావింటపర్తి గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండ పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ డి.రామకృష్ణ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు.ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.3160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.


