అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల స్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం పెళ్లి బృందంతో తిరిగి వస్తుండగా డీసీఎం 44వ జాతీయరహదారి పక్కన బోల్తా పడింది. గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన దాదాపుగా 50 మంది డీసీఎం లో ఉన్నారు. కర్నూలులో వివాహ వేడుకలకు జరుపుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షంలో డిసియం వేగంగా వస్తుండగా, నిలిచి ఉన్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. ఒక మహిళ, చిన్నారి డీసీఎం లో ఇరుక్కుపోయారు. కాపాడాలి అంటూ వారు రోదనలు చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. డీసీఎం లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు హైవే సిబ్బంది, స్థానిక పోలీసులు రెండు గంటలు ప్రయత్నించి బయటకు తీశారు .

పెళ్ళికి వెళ్లి వస్తుండగా డిసిఏం అదుపుతప్పి బోల్తా – పలువురికి గాయాలు.
అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల స్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం పెళ్లి బృందంతో తిరిగి వస్తుండగా డీసీఎం 44వ జాతీయరహదారి పక్కన బోల్తా పడింది. గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన దాదాపుగా 50 మంది డీసీఎం లో ఉన్నారు. కర్నూలులో వివాహ వేడుకలకు జరుపుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షంలో డిసియం వేగంగా వస్తుండగా, నిలిచి ఉన్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. ఒక మహిళ, చిన్నారి డీసీఎం లో ఇరుక్కుపోయారు. కాపాడాలి అంటూ వారు రోదనలు చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. డీసీఎం లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు హైవే సిబ్బంది, స్థానిక పోలీసులు రెండు గంటలు ప్రయత్నించి బయటకు తీశారు .

