ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చు.
1.అప్పీల్ కోరుతూ అర్జీ(ఎంపీడీఓ గారికి రాయాలి)
2.ఆధార్ కార్డు జిరాక్స్.
3.పెన్షన్ రద్దు /పెన్షన్ మార్పు నోటీసు
4.సదరం సర్టిఫికేటు (పాతది)
5.సదరం సర్టిఫికేట్ (కొత్తది)
అలాగే పెన్షన్ దారునికి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి.
అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి Reassement (పునఃమూల్యాంకనం)కు నోటీసు జారీ చేస్తారు.
పింఛను దారులు మరొకసారి Reasssement(పునఃమూల్యాంకనం) కొరకు హాజరు కావాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక
అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.ఎంపీడీఓ గారి ద్వారా Reassesment (పునఃమూల్యాంకనం)కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత నిర్దేశించిన హాస్పిటల్ కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

