శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెన్షనర్స్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులను శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి ఘనంగా అభినందించారు. విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ .. ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించేందుకు అండగా నిలవాలని కోరారు. గతంలో కోల్పోయిన పీఆర్సీ, ఐఆర్సీ వంటి ప్రయోజనాలను పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకి వినతి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి. వెంకయ్య, ఉపాధ్యక్షులు పురుషోత్తం గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వి. ప్రసాద్, వెంకట రమణయ్య తదితరులు విశేషంగా పాల్గొన్నారు.

పెన్షనర్స్ దినోత్సవంలో విశ్రాంతి ఉద్యోగులకు ఎమ్మెల్యే సత్కారం