
పెద్దపల్లి జిల్లా పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపిక
పెద్దపల్లి, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా నూతన పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర రెడ్డి లు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిల్లా ఆవిర్భావం తర్వాత కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కానుగంటి శ్రీనివాస్ ను తిరిగి ఆ పదవి కోసం ఎంపిక చేసి, అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తిని నియామకం చేసినందుకు పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి, వివిధ మండల శాఖల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలకు, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

