డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. పి. గన్నవరం
ఆటో డ్రైవర్లు సేవలో” కార్యక్రమం పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం 15 వేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఈ మొత్తాన్ని అందించారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
కార్మికుల జీవితాల్లో వెలిగు నింపాలనదే తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం త్రీ రోడ్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొద్దిసేపు ఆటో నడిపి కూటమి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
పి. గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాలకు మొత్తం 1263 మంది లబ్ధిదారులకు రూ. 1,77,7500 /- లు లబ్ది చేకూరనుంది.
ఈ కార్యక్రమం లో కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


