పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక విలువలు, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు కూడా అవసరమని సూచించారు.
గురువారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగ్‌నగర్‌లోని శ్రీరామ్ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొండా ఉమ మాట్లాడుతూ, శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒక రోజు ముందుగానే పిల్లల కోసం అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో శిక్షణ ఇస్తోందని ప్రశంసించారు. గతంలో సింగ్‌నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో కూడా ఈ పాఠశాల ఆధ్వర్యంలో అద్భుతమైన స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని గుర్తుచేశారు.
చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ప్రతి విద్యార్థికి తప్పనిసరి కావాలని సూచించారు. విద్యార్థుల్లో కొందరు టెన్త్ క్లాస్‌లో 594 మార్కులు సాధించడం పాఠశాల క్రమశిక్షణ కు నిదర్శనమని అన్నారు. టీచర్లు, మాస్టర్లు పిల్లలపై చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయ మని పేర్కొన్నారు.తల్లిదండ్రులు పిల్లల కార్యక్రమాలకు హాజరై వారిని ప్రోత్సహిస్తే, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని బొండా ఉమ తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇటువంటి కార్యక్ర మాలను శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా బొండా ఉమ ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను సన్మానించి, పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర కీలకం : ఎమ్మెల్యే బొండా ఉమ
పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక విలువలు, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు కూడా అవసరమని సూచించారు. గురువారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగ్‌నగర్‌లోని శ్రీరామ్ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొండా ఉమ మాట్లాడుతూ, శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒక రోజు ముందుగానే పిల్లల కోసం అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో శిక్షణ ఇస్తోందని ప్రశంసించారు. గతంలో సింగ్‌నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో కూడా ఈ పాఠశాల ఆధ్వర్యంలో అద్భుతమైన స్పోర్ట్స్ మీట్ నిర్వహించామని గుర్తుచేశారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ప్రతి విద్యార్థికి తప్పనిసరి కావాలని సూచించారు. విద్యార్థుల్లో కొందరు టెన్త్ క్లాస్‌లో 594 మార్కులు సాధించడం పాఠశాల క్రమశిక్షణ కు నిదర్శనమని అన్నారు. టీచర్లు, మాస్టర్లు పిల్లలపై చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయ మని పేర్కొన్నారు.తల్లిదండ్రులు పిల్లల కార్యక్రమాలకు హాజరై వారిని ప్రోత్సహిస్తే, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని బొండా ఉమ తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇటువంటి కార్యక్ర మాలను శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా బొండా ఉమ ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను సన్మానించి, పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

