(పున్నమి ప్రతినిధి)
బద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల మండలంలో, ‘పాత మొబైల్స్‌కి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ గ్రామాల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన అక్తర్ ఆలీఖాన్ అనే వ్యక్తి పాత మొబైల్ ఫోన్లు సేకరించి, బీహార్‌లోని సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నట్లు విచారణలో తేలింది. వారు ఈ ఫోన్లను మరమ్మతులు చేసి, ఐఈఎంఐ నంబర్లు మార్పు చేసి సైబర్ నేరాలకు వాడుతున్నారని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి 150 పాత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటివారికి పాత ఫోన్లు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరించారు.


