Thursday, 5 February 2026
  • Home  
  • పాత గాజువాకలో రాజశ్యామల అమ్మవారి దర్శనం – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు
- విశాఖపట్నం

పాత గాజువాకలో రాజశ్యామల అమ్మవారి దర్శనం – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): పాత గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన రాజశ్యామల అమ్మవారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్యామలానందనాథ స్వామీజీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతంలో తొమ్మిది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభకరమని పేర్కొన్నారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి):

పాత గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన రాజశ్యామల అమ్మవారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్యామలానందనాథ స్వామీజీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతంలో తొమ్మిది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభకరమని పేర్కొన్నారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.