Sunday, 7 December 2025
  • Home  
  • పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలు చేసే భక్తులకు విన్నపం
- విశాఖపట్నం

పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలు చేసే భక్తులకు విన్నపం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని బంగాళాఖాతం బీచ్ లకు చాలా మంది భక్తులు, సందర్శకులు వచ్చే సందర్భంగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇంచార్జి ఉన్నత అధికారి మరియు విశాఖపట్నం రేంజ్ డిఐజి గారు అయిన శ్రీ గోపినాథ్ జట్టి, ఐ.పి.ఎస్ గారు రాష్ట్ర వ్యాప్త మెరైన్ పోలీస్ అధికారులందరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరుగుటకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మెరైన్ పోలీస్ అధికారులు అందరూ వారి వారి సిబ్బందితో రేపు తెల్లవారుజామున 3 గంటల నుండే తమ తమ బీచులలో బందోబస్తు విధులలో ఉండాలని, అన్నిరకాల ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన అన్ని చర్యలు తీసుకోవాలని, అలాగే స్థానిక పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, మత్స్యకార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక మత్స్యకారులు, స్వచ్చంద సంస్థలు మొదలైన వారు అందరితో మంచిగా అనుసంధానం చేసుకొని భక్తులు, సందర్శకులు అందరికీ ఎలాంటి అసౌకర్యం, ప్రమాదం కలుగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే భక్తులు, సందర్శకులకు కూడా క్రింది సలహాలు, సూచనలను ఇవ్వడం జరిగింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకులకు మెరైన్ పోలీసు వారి విజ్ఞప్తి* 1. సందర్శకులు పోలీసు వారి సూచనలను తప్పకుండా పాటించి, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలి. 2. పోలీసులు విధుల్లో ఉన్న ప్రదేశంలో, వారి సూచనలను అనుసరించి మాత్రమే సముద్ర స్నానాలకు దిగాలి; ఎక్కువ దూరం లోపలకు పోకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత వహించాలి. 3. ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం వల్ల సముద్రంలో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి దిగబడే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సముద్రం బయటకు ప్రశాంతంగా ఉన్నట్లు కన్పిస్తుంది. కానీ లోపల చాలా ప్రమాదకర గుంతలు, సుడిగుండాలు ఉండవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 4. చిన్న పిల్లలను అన్ని సమయంలో మీ దగ్గర ఉంచుకొని మాత్రమే స్నానాలు చేయచేయించాలి మరియు ఒడ్డుకు తీసుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. 5. స్నానాల సమయంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. 6. సముద్ర తీర ప్రాంతంలో మద్యం సేవించడం, గందరగోళం సృష్టించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయకూడదు. 7. ఎవరైనా ప్రమాదంలో పడ్డారు అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న మెరైన్ పోలీస్ సిబ్బంది లేదా లైఫ్ గార్డులకు తెలియజేయాలి. 8. సముద్ర అలలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు స్నానాలకు దిగకూడదు. 9. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మరియు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ సూచనలు తప్పకుండా పాటించాలి. 10. వృద్ధులు, గర్భిణి స్త్రీలు మరియు చిన్న పిల్లలు సముద్రంలో లోతుగా దిగకూడరు. 11. ఏదైనా అనుమానాస్పద వస్తువు, వ్యక్తి లేదా పరిణామం గమనించిన, వెంటనే మెరైన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ 1093 కు సమాచారం ఇవ్వాలి. 12. మీ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి ఉంచాలి. 13. ఫోటో లేదా వీడియో తీసేటప్పుడు సముద్రానికి అత్యంత దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. 14. సముద్ర స్నానానికి వెళ్ళే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనారోగ్యంగా ఉంటే స్నానానికి దిగరాదు. 15. వర్షాకాలం లేదా తుఫాను హెచ్చరికలు ఉన్నపుడు వెంటనే బీచ్ ఖాళీ చేయాలి. 16. సముద్ర తీరానికి వచ్చే సందర్శకులు ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులు/స్నేహితులతో సమూహంగా కలిసి ఉండాలి; దూరంగా ఉండకూడదు. 17. మీ భద్రత కోసం మెరైన్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు లేదా హెచ్చరిక రోపులను దాటి వెళ్లకూడదు. 18. బీచ్ వద్ద తప్పిపోయిన వ్యక్తులు లేదా పిల్లలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. 19. బీచ్ వద్ద అతి శబ్దకరమైన స్పీకర్లు, డీజే మొదలైనవి వినియోగించకూడదు. 20. సాయంత్రం 6 గంటల తర్వాత సముద్ర స్నానాలకు దిగకూడదు. 21. సముద్రంలో ఈత కొట్టడం, బోట్లు లేదా ట్యూబులు వినియోగించడం ప్రమాదకరం. 22. ఏదైనా గాయపడిన వ్యక్తి లేదా అత్యవసర పరిస్థితి అయితే వెంటనే 100 లేదా మెరైన్ పోలీస్ హెల్ప్‌లైన్‌ 1093 కు కాల్ చేయండి.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని బంగాళాఖాతం బీచ్ లకు చాలా మంది భక్తులు, సందర్శకులు వచ్చే సందర్భంగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇంచార్జి ఉన్నత అధికారి మరియు విశాఖపట్నం రేంజ్ డిఐజి గారు అయిన శ్రీ గోపినాథ్ జట్టి, ఐ.పి.ఎస్ గారు రాష్ట్ర వ్యాప్త మెరైన్ పోలీస్ అధికారులందరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరుగుటకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మెరైన్ పోలీస్ అధికారులు అందరూ వారి వారి సిబ్బందితో రేపు తెల్లవారుజామున 3 గంటల నుండే తమ తమ బీచులలో బందోబస్తు విధులలో ఉండాలని, అన్నిరకాల ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన అన్ని చర్యలు తీసుకోవాలని, అలాగే స్థానిక పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, మత్స్యకార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక మత్స్యకారులు, స్వచ్చంద సంస్థలు మొదలైన వారు అందరితో మంచిగా అనుసంధానం చేసుకొని భక్తులు, సందర్శకులు అందరికీ ఎలాంటి అసౌకర్యం, ప్రమాదం కలుగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది.
అలాగే భక్తులు, సందర్శకులకు కూడా క్రింది సలహాలు, సూచనలను ఇవ్వడం జరిగింది.

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకులకు మెరైన్ పోలీసు వారి విజ్ఞప్తి*

1. సందర్శకులు పోలీసు వారి సూచనలను తప్పకుండా పాటించి, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలి.

2. పోలీసులు విధుల్లో ఉన్న ప్రదేశంలో, వారి సూచనలను అనుసరించి మాత్రమే సముద్ర స్నానాలకు దిగాలి; ఎక్కువ దూరం లోపలకు పోకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత వహించాలి.

3. ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం వల్ల సముద్రంలో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి దిగబడే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సముద్రం బయటకు ప్రశాంతంగా ఉన్నట్లు కన్పిస్తుంది. కానీ లోపల చాలా ప్రమాదకర గుంతలు, సుడిగుండాలు ఉండవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

4. చిన్న పిల్లలను అన్ని సమయంలో మీ దగ్గర ఉంచుకొని మాత్రమే స్నానాలు చేయచేయించాలి మరియు ఒడ్డుకు తీసుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.

5. స్నానాల సమయంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

6. సముద్ర తీర ప్రాంతంలో మద్యం సేవించడం, గందరగోళం సృష్టించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయకూడదు.

7. ఎవరైనా ప్రమాదంలో పడ్డారు అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న మెరైన్ పోలీస్ సిబ్బంది లేదా లైఫ్ గార్డులకు తెలియజేయాలి.

8. సముద్ర అలలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు స్నానాలకు దిగకూడదు.

9. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మరియు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ సూచనలు తప్పకుండా పాటించాలి.

10. వృద్ధులు, గర్భిణి స్త్రీలు మరియు చిన్న పిల్లలు సముద్రంలో లోతుగా దిగకూడరు.

11. ఏదైనా అనుమానాస్పద వస్తువు, వ్యక్తి లేదా పరిణామం గమనించిన, వెంటనే మెరైన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ 1093 కు సమాచారం ఇవ్వాలి.

12. మీ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి ఉంచాలి.

13. ఫోటో లేదా వీడియో తీసేటప్పుడు సముద్రానికి అత్యంత దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

14. సముద్ర స్నానానికి వెళ్ళే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనారోగ్యంగా ఉంటే స్నానానికి దిగరాదు.
15. వర్షాకాలం లేదా తుఫాను హెచ్చరికలు ఉన్నపుడు వెంటనే బీచ్ ఖాళీ చేయాలి.

16. సముద్ర తీరానికి వచ్చే సందర్శకులు ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులు/స్నేహితులతో సమూహంగా కలిసి ఉండాలి; దూరంగా ఉండకూడదు.

17. మీ భద్రత కోసం మెరైన్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు లేదా హెచ్చరిక రోపులను దాటి వెళ్లకూడదు.

18. బీచ్ వద్ద తప్పిపోయిన వ్యక్తులు లేదా పిల్లలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి.
19. బీచ్ వద్ద అతి శబ్దకరమైన స్పీకర్లు, డీజే మొదలైనవి వినియోగించకూడదు.
20. సాయంత్రం 6 గంటల తర్వాత సముద్ర స్నానాలకు దిగకూడదు.

21. సముద్రంలో ఈత కొట్టడం, బోట్లు లేదా ట్యూబులు వినియోగించడం ప్రమాదకరం.

22. ఏదైనా గాయపడిన వ్యక్తి లేదా అత్యవసర పరిస్థితి అయితే వెంటనే 100 లేదా మెరైన్ పోలీస్ హెల్ప్‌లైన్‌ 1093 కు కాల్ చేయండి.

1 Comment

  1. bkfvvp

    November 4, 2025

    wfsdts

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.