పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో సురేష్ కాకర్ల
ఉదయగిరి లో 759 ఎకరాలలో పండ్ల తోటలు.
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల తో
రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే ద్వేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దీర్ఘకాలిక పంటలపై మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ప్రోత్సాహాలు అందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాలలో ఒకే రోజు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో కోట ఎరుకల రెడ్డి పొలంలో మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఏపీ డి మృదుల, స్థానిక నాయకులతో కలసి పండ్ల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం టార్గెట్ 759 ఎకరాలు కాగా ఈ ఒక్కరోజు 150ఎకరాలు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాలలో ఉపాధి హామీ పథకం క్రింద మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ పథకం అర ఎకరాకు పైబడి ఐదు ఎకరాలు లోపల ఉన్న రైతులందరికీ వర్తిస్తుందన్నారు. మూడు సంవత్సరాలు విడతల వారీగా పండ్ల తోటలను బట్టి ఒక్కో పంటకు ఒక్కో విధంగా, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఒక్క ఎకరం నిమ్మ పంటకు సుమారు మూడు సంవత్సరాలకు కలిపి ఒక లక్షా నలభై ఐదు వేల రూపాయలు అందుతుందన్నారు. పండ్ల తోటలలో అంతర్గత పంటలు, వేసుకొని ఆదాయం పొందవచ్చు అన్నారు. అదేవిధంగా రైతుల అనుమతితో ఫారం పాండ్స్ ను తవ్వడం జరుగుతుందన్నారు. కనుక రైతన్నలు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభసాటి వ్యవసాయాన్ని పొందాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, వనిపెంట సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, జయంత్ రెడ్డి, సర్పంచ్ ఖాజా రెడ్డి, ముంతా శ్రీనివాసులు యాదవ్, కొండపల్లి వెంకటేశ్వర్లు,దిండు నారాయణ, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, ఈసీ కృష్ణారావు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో సురేష్ కాకర్ల ఉదయగిరి లో 759 ఎకరాలలో పండ్ల తోటలు
పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో సురేష్ కాకర్ల ఉదయగిరి లో 759 ఎకరాలలో పండ్ల తోటలు. జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల తో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే ద్వేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దీర్ఘకాలిక పంటలపై మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ప్రోత్సాహాలు అందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాలలో ఒకే రోజు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో కోట ఎరుకల రెడ్డి పొలంలో మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఏపీ డి మృదుల, స్థానిక నాయకులతో కలసి పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం టార్గెట్ 759 ఎకరాలు కాగా ఈ ఒక్కరోజు 150ఎకరాలు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాలలో ఉపాధి హామీ పథకం క్రింద మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ పథకం అర ఎకరాకు పైబడి ఐదు ఎకరాలు లోపల ఉన్న రైతులందరికీ వర్తిస్తుందన్నారు. మూడు సంవత్సరాలు విడతల వారీగా పండ్ల తోటలను బట్టి ఒక్కో పంటకు ఒక్కో విధంగా, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఒక్క ఎకరం నిమ్మ పంటకు సుమారు మూడు సంవత్సరాలకు కలిపి ఒక లక్షా నలభై ఐదు వేల రూపాయలు అందుతుందన్నారు. పండ్ల తోటలలో అంతర్గత పంటలు, వేసుకొని ఆదాయం పొందవచ్చు అన్నారు. అదేవిధంగా రైతుల అనుమతితో ఫారం పాండ్స్ ను తవ్వడం జరుగుతుందన్నారు. కనుక రైతన్నలు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభసాటి వ్యవసాయాన్ని పొందాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, వనిపెంట సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, జయంత్ రెడ్డి, సర్పంచ్ ఖాజా రెడ్డి, ముంతా శ్రీనివాసులు యాదవ్, కొండపల్లి వెంకటేశ్వర్లు,దిండు నారాయణ, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, ఈసీ కృష్ణారావు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

