ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్21 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. గ్రామంలోని 40 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి గ్రామస్తులు మంచి సహకారం అందించడంతో లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించారు.


