పలమనేరుకు చెందిన రగ్బీ క్రీడాకారిణి అక్షయకు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. బీహార్ వేదికగా ఈ నెల 9,10 తేదీలలో జరిగిన ఏషియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్ లో చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన నర్రా సురేష్, శ్రీదేవిల కుమార్తె అక్షయ రగ్బీ క్రీడాకారిణి భారత జట్టు తరపున ఆడి కాంస్య పతకం సాధించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఛాంపియన్‌షిప్ లో ఆమె కనబరిచిన ప్రదర్శన క్రీడల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని కనబరుస్తున్నదన్నారు. పట్టుదల, కఠోర శిక్షణ, ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన అక్షయ నేటి యువతరానికి ఆదర్శమని భవిష్యత్తులో మరింత అత్యుత్తమంగా రాణించి ఈ ప్రాంతానికి పేరును తీసుకురావాలాని కోరుతూ ఆమెకు ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా అక్షయను ప్రోత్సహించి ఆమె ఎదుగుదలకు కృషి చేసిన వారి తల్లిదండ్రులకు సైతం ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

*పలమనేరు క్రీడాకారిణి అక్షయకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*