పద్మశ్రీ పరంధామయ్యకు అమెరికా విశ్వవిద్యాలయం అవార్డు
నెల్లూరు , ఏప్రిల్ (కల్చరల్ పున్నమి ప్రతినిధి)
విశిష్ట కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పరంధామయ్య గారిని అమెరికాలోని ది అమెరికన్ యూనివర్శిటీ (The American University, USA) వారు పెర్ఫార్మన్స్ అప్ప్రెసియేషన్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. కళారంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించడంపై తెలుగు సాంస్కృతిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పరంధామయ్య గారు పలువురు కళాకారులకు మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తిత్వం, ఆయన ప్రదర్శనలు దేశ విదేశాలలో సంగీత ప్రియులను ఆకట్టుకున్న తీరు, బహుళ కళారూపాలపై గల ప్రావీణ్యం ఆయనకు ఈ పురస్కారం రావడానికి కారణమయ్యాయి. అమెరికాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రతినిధులు ఆయనకు ఈ గౌరవాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు, “పరంధామయ్య గారు భారతీయ సంప్రదాయ కళలకు సమకూరిన మూల్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారిలో ఒకరు. ఆయన కళాప్రతిభ, కృషి, నిబద్ధత మా విశ్వవిద్యాలయానికి ఆదర్శంగా నిలిచాయి,” అని పేర్కొన్నారు.
పరంధామయ్య గారు ఈ గౌరవాన్ని తన కళ గురువులందరికీ, అభిమానులకీ అంకితమిస్తూ, “ఇది వ్యక్తిగత విజయం కాదని, మన సంస్కృతికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను,” అన్నారు.

