నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి:
ఒక్క ముస్లిం అమ్మాయికి దుల్హన్ పథకము ఇవ్వాలంటే లక్ష రూపాయలు అవుతుంది ఆ డబ్బులు ఇవ్వకుండా పదిమంది మోజోన్లకు వేతనం ఇవ్వచ్చు ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే ఇచ్చినారు కానీ దుల్హన్ పథకము కళ్యాణమస్తు మహిళలందరూ బహిరంగ వేదికలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానము నేటి వరకు అమలు జరగలేదు. వీటిపైన ఆ పార్టీలో ఉన్న పదవులు పొందిన నాయకులు మాట్లాడే శక్తి ఉందా ఇది మోసం కాదా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కదా గత ప్రభుత్వము కరోనా సమయంలో కూడా చదువుకున్న వారికి 50 వేల రూపాయలు పెండ్లి సందర్భంగా ఇచ్చారు మీరు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన గాని నేటి వరకు అమలు జరగలేదు ఈ పథకం కింద పెళ్లయిన వారికి కూడా బకాయిలు ఇవ్వరు ఆ విధంగా పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఆడపిల్లలను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పిన హామీ ఏమైంది చెప్పండి కోట్ల రూపాయలు విదేశీ యులు పెట్టుబడి పెడితే వారికి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నవి నాలుగు నక్షత్రాలు ఐదు నక్షత్రాలు హోటల్స్ పెట్టే వారి కూడా డబ్బులు ఉన్నవి కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మాత్రం అమలు చేయడానికి డబ్బులు లేవు ఇది ముస్లిం మైనార్టీ పదవులు పొందిన నాయకులు ప్రజలకు తెలియజేయాలి అలాగే సూపర్ సిక్స్ అని చెప్పారు రెండోసారి వంట గ్యాస్ కు డబ్బులు ఇవ్వలేదు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఉన్నారు వారందరూ ఈరోజు బాధపడడం మీ ప్రభుత్వానికి తగునా ఈరోజు విశాఖపట్నంలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పారిశ్రామిక రంగాన్ని కమ్యూనికేషన్ మరియు విద్యుత్తు లఘు పరిశ్రమలకు ఖర్చుపెట్టి నిరుద్యోగాన్ని నిర్మూలించే ప్రయత్నం అంటున్నారు మంచిదే కానీ వారు లాభాల శ్రేయస్సు తో పనిచేసేవారు నష్టం వస్తే మూసుకొని వెళ్ళిపోతారు ఉద్యోగాలు కోల్పోతారు మన డబ్బు మన భూములు వారి సొంతం అవుతాయి మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారంలో ఉండదు. అప్పుడు నష్టపోయేది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల పైన అప్పు తెచ్చి కార్పొరేట్ సంస్థలకు జేబులో నింపి పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల వారికి కడుపు కొట్టే చర్యలు రాబోయే రోజుల్లో చవిచూడక తప్పదు
గతంలో ఈ సమస్యలు ఆ ప్రభుత్వము అంటే వైసీ ప్రభుత్వం చేయలేదని ప్రచారం చేసిన వారే ఈరోజు ఆ సమస్యలు ఉన్న పరిష్కారం కోసం మంత్రుల వద్ద మాట్లాడా లేని పరిస్థితి ఉన్నది 90 కోట్ల రూపాయలు మౌజనులకు ఇచ్చిన అంటున్నారు ఇది గత సంవత్సరం నుండి వారికి రావలసిన వేతన బకాయి ఇమాములు మౌజనులకు కలిపి ఉన్న బకాయి డబ్బులు చెల్లించారు
కనీసము ఒక కుటుంబం జీవించడానికి మీ ప్రభుత్వ లేబర్ ఆఫీసర్ల లెక్కల ప్రకారము మీరు గమనించిన ఇంటి అద్దె విద్యుత్ చార్జీలు పాలు నిత్యవసర వస్తువులు మందుల ఖర్చులకు గాను మరియు బట్టలు శుభ్రం చేసుకొనుటకు శరీరసుబ్రతకు సబ్బులు నూనె అన్ని కలిపితే 30 వేల అవసరమని చెప్పిన మీరే ఈరోజు ఇమాము 10000 మోవుజెన్ 5000 తో ఏ విధంగా జీవిస్తాడు వాలంటీర్లకు 5000 రూపాయలు ఇస్తే గత ప్రభుత్వము మీరు 5000 జీతంతో ఏ విధంగా జీవిస్తాడు ఆయనకు పిల్లను ఇవ్వరు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే జీతం పెంచుతాను మరియు అర్హత ఉన్నవారికి తగిన పోస్టు ఇస్తానన్నారు ఈరోజు మొండిచేయి చూపించారు ఇది మోసం కాదా
డిగ్రీ విద్యార్థులకు నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని అలాగే ఇంజనీరింగ్ పై చదువులు చదివే వారికి ఎంబీబీఎస్ చదివే వారికి ఫీజులు వారి ఖాతాలో రానందుకు విద్యాసంస్థలకు చెల్లించనందుకు బాధపడే విద్యార్థుల పరిస్థితి ఒకవైపు ఉంటే మరొకవైపు విదేశీ విద్య అంటున్నారు విదేశాల్లో పోయి నేడు చదువుకునే పరిస్థితి లేదు అమెరికాలో మనం చూస్తున్నాము కావున మన రాష్ట్రంలో ఉన్నవారికి అందరికీ విద్యా వైద్యము ఇల్లు తినడానికి తిండి ఉండడానికి ఇండ్లు కల్పించండి విదేశీ శక్తులను పెంచి పోషించడం మానండి మొన్ననే అబ్దుల్ కలాం ఆజాదు జయంతి ఉత్సవాలు జరిపారు ఆయన గారు విదేశీయుల తో పోరాడి సాయంత్రం వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇచ్చినారు మైనార్టీలకు ప్రార్ధన ఇచ్చినారు అందుకే జాతీయ విద్యా విధానము మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అని జరుపుతున్నారు వారి త్యాగాలు స్మరించుకున్న వారు విదేశాల్లో ఉన్నవారు వచ్చి పెట్టుబడి పెట్టుటకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు
గతంలో మీ పార్టీలో పదవులు పొందిన నాయకులు ముస్లింలు దేశ రక్షణ కోసం త్యాగం చేశారు ప్రాణాలర్పించారు ఢిల్లీలో పోయి చూడండి అని చెప్పిన వారు నేడు అటువంటి ముస్లింలు కుటుంబాలు ఆకలితో అలమటిస్తుంటే ఇతర వర్గాల వారు కూడా అన్నమో రామచంద్ర అని కేకలు వేస్తుంటే మీరు మీ పార్టీ వారు ప్రశాంతంగా మీడియాలో బ్రహ్మాండంగా మేము అన్ని చేస్తున్నామని చెప్పుకోవడం మోసం చేయడము మీ సూత్రాలు గతంలో నేడు గమనిస్తే మా తాతగారు నేతులు తాగినారు మేము మీ మీసాలు తూర్చుకుంటాం అన్న చందంగా వారి పేర్లు చెప్పుకొని బ్రతికే కన్నా నేడు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ముస్లిం సంఘాలు వ్యక్తులు నాయకులు పదవిలో ఉన్న వారందరూ మాట్లాడితే బాగుంటుంది అని సిపిఎం మాజీ జిల్లా నాయకుడు ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి తెలియజేశారు
రాష్ట్రంలో ఏమి చేయలేక పోయినా కనీసము మీరు ఉన్న ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ద్వారా నిధులు సాధించి అభివృద్ధి చేయండి పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజలు అన్ని వింటారు సమయం వచ్చినప్పుడు రోడ్డుపైన నిలబెడతారు గమనించగలరని తెలియజేసిన ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి.


