Thursday, 5 February 2026
  • Home  
  • పంది దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంది దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదూరుపల్లిలో బహిర్భూమికి వెళ్లిన దేవరాల పెంచలమ్మ అనే మహిళపై పందులు దాడి చేశాయి.పందుల దాడిలో ఆమె కాలు,ముఖం తీవ్రంగా గాయపడ్డాయి.రక్తస్రావం ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఆరుకుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు.గ్రామంలో తరచుగా పందులు తిరుగుతున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. పందుల పెంపకం దారునిపై పోలీసులకు ఫిర్యాదు – పంచాయతీ కార్యదర్శి రఫీ చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో పందుల పెంపకందారుడు ఎస్.దయాకర్‌పై పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడు సంవత్సరాలుగా దయాకర్ బయట నుంచి పందులను తెచ్చి గ్రామంలో మేపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపారు. బస్టాండ్లో పందులను వదిలేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పందులు ప్రజలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండలం ఆదూరుపల్లిలో బహిర్భూమికి వెళ్లిన దేవరాల పెంచలమ్మ అనే మహిళపై పందులు దాడి చేశాయి.పందుల దాడిలో ఆమె కాలు,ముఖం తీవ్రంగా గాయపడ్డాయి.రక్తస్రావం ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఆరుకుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు.గ్రామంలో తరచుగా పందులు తిరుగుతున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.

పందుల పెంపకం దారునిపై పోలీసులకు ఫిర్యాదు – పంచాయతీ కార్యదర్శి రఫీ

చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో పందుల పెంపకందారుడు ఎస్.దయాకర్‌పై పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడు సంవత్సరాలుగా దయాకర్ బయట నుంచి పందులను తెచ్చి గ్రామంలో మేపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపారు. బస్టాండ్లో పందులను వదిలేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పందులు ప్రజలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.