Thursday, 26 March 2026
  • Home  
  • పండుగలు మరియు ఆదివారం సెలవులు వస్తె మీ పిల్లల మీద ఓ కన్నేయండి.
- అన్నమయ్య

పండుగలు మరియు ఆదివారం సెలవులు వస్తె మీ పిల్లల మీద ఓ కన్నేయండి.

ఇటీవల కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల కన్యక చెరువు నీటి ప్రవాహం ఎక్కువ అయిన సందర్భంగా కన్యక చెరువులో నీటిమట్టం పెరిగింది. నాగిరెడ్డిపల్లి పంచాయతీ గాంధీనగర్ ఆంజనేయ స్వామి ఆలయము ప్రాంగణంలో కన్యక చెరువు వద్ద నీళ్ళు భారీ స్థాయిలో చేరుకుంటుంది. గాంధీనగర్ గ్రామముకు సమీపంలో చెరువు ఉన్న కారణంగా ప్రస్తుతం దీపావళి సెలవులు కావడంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పిల్లలు చేపలు పట్టేందుకు ఈత కొట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్తున్నారు.గతంలో కన్యకచెరువులో మట్టితోవడంతో లోతట్టు గుంతలు ఏర్పడ్డాయి. దీనిలో పిల్లలు అనుకోకుండా చెరువులో పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.గతంలో ఇదే చెరువులో గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు నీటి వనరుల వద్ద ఉండే ప్రమాదాల గురించి వివరించాలి. ఎంత లోతు ఉంటుందో,లోతైన గుంతలు ఎలా ఏర్పడతాయో తెలియజేయాలి.కావున చెరువు కుంటలు వద్ద ఎవరైనా పిల్లలు కనబడితే పెద్దలు వారిని వెంటనే అక్కడి నుంచి పంపేయాలి.

ఇటీవల కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల కన్యక చెరువు నీటి ప్రవాహం ఎక్కువ అయిన సందర్భంగా కన్యక చెరువులో నీటిమట్టం పెరిగింది.
నాగిరెడ్డిపల్లి పంచాయతీ గాంధీనగర్ ఆంజనేయ స్వామి ఆలయము ప్రాంగణంలో కన్యక చెరువు వద్ద నీళ్ళు భారీ స్థాయిలో చేరుకుంటుంది. గాంధీనగర్ గ్రామముకు సమీపంలో చెరువు ఉన్న కారణంగా ప్రస్తుతం దీపావళి సెలవులు కావడంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పిల్లలు చేపలు పట్టేందుకు ఈత కొట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్తున్నారు.గతంలో కన్యకచెరువులో మట్టితోవడంతో లోతట్టు గుంతలు ఏర్పడ్డాయి.
దీనిలో పిల్లలు అనుకోకుండా చెరువులో పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.గతంలో ఇదే చెరువులో గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు.
తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు నీటి వనరుల వద్ద ఉండే ప్రమాదాల గురించి వివరించాలి. ఎంత లోతు ఉంటుందో,లోతైన గుంతలు ఎలా ఏర్పడతాయో తెలియజేయాలి.కావున చెరువు కుంటలు వద్ద ఎవరైనా పిల్లలు కనబడితే పెద్దలు వారిని వెంటనే అక్కడి నుంచి పంపేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.