Sunday, 29 March 2026
  • Home  
  • పండగ పూట కుక్కల దాడి రామారెడ్డి మండలంలో 13 మందికి గాయాలు!
- కామారెడ్డి

పండగ పూట కుక్కల దాడి రామారెడ్డి మండలంలో 13 మందికి గాయాలు!

కామారెడ్డి, 15 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పండగ సందర్భంగా రామాలయం వీధిలో కుక్కలు 13 మందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో గాయ పడిన వారిని స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ త్వరగా ప్రథమ చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సి)కు తీసుకెళ్లారు. అక్కడ వారికి అవసరమైన రాబీస్ వ్యాక్సిన్‌లు ఇచ్చి, సురక్షితం చేశారు.సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పండగల సమయంలో ఇలాంటి దాడులు జరగ కుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నువ్వు కాపాడుకోవాలంటే మనమే, కుక్కల దాడి నుంచి రక్షించుకోవాలన్నా మనమే. రామాలయం వీధి వంటి ప్రధాన ప్రదేశాల్లో కుక్కలు తిరుగుతు న్నాయి కాబట్టి, పిల్లలు, ముఖ్యంగా మహిళలు రాత్రి, ఉదయం ప్రతి సమయంలో జాగ్రత్తగా ఉండా లని సూచించారు.ఇంతకు ముందు ఈ విషయంపై పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.గ్రామస్థులు ఈ ఘటనపై కల త్రోపం వ్యక్తం చేస్తూ, మండల అధికారులు, వైద్య శాఖ నుంచి త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్థానిక పంచాయతీ ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ హామీ ఇచ్చారు.కుక్కల దాడుల నుంచి రక్షణకు గ్రామీణ ప్రాంతాల్లో అవగా హన అవసరం. పండగల సంబరాల్లో జాగ్రత్తలు పాటించి, సమాజాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.

కామారెడ్డి, 15 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పండగ సందర్భంగా రామాలయం వీధిలో కుక్కలు 13 మందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో గాయ పడిన వారిని స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ త్వరగా ప్రథమ చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సి)కు తీసుకెళ్లారు. అక్కడ వారికి అవసరమైన రాబీస్ వ్యాక్సిన్‌లు ఇచ్చి, సురక్షితం చేశారు.సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పండగల సమయంలో ఇలాంటి దాడులు జరగ కుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నువ్వు కాపాడుకోవాలంటే మనమే, కుక్కల దాడి నుంచి రక్షించుకోవాలన్నా మనమే. రామాలయం వీధి వంటి ప్రధాన ప్రదేశాల్లో కుక్కలు తిరుగుతు న్నాయి కాబట్టి, పిల్లలు, ముఖ్యంగా మహిళలు రాత్రి, ఉదయం ప్రతి సమయంలో జాగ్రత్తగా ఉండా లని సూచించారు.ఇంతకు ముందు ఈ విషయంపై పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.గ్రామస్థులు ఈ ఘటనపై కల త్రోపం వ్యక్తం చేస్తూ, మండల అధికారులు, వైద్య శాఖ నుంచి త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్థానిక పంచాయతీ ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ హామీ ఇచ్చారు.కుక్కల దాడుల నుంచి రక్షణకు గ్రామీణ ప్రాంతాల్లో అవగా హన అవసరం. పండగల సంబరాల్లో జాగ్రత్తలు పాటించి, సమాజాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.