కామారెడ్డి, 12 డిసెంబర్ పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచిన అందరికీ హార్దిక అభినందనలు! ప్రజల నమ్మకంతో ఓట్లు పోసి గెలిపించిన మీరు, రాబోయే రోజుల్లో గ్రామాల సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి రంగంలో ముందడుగు వేయాలి!గ్రామాల్ని ఆదర్శ పల్లెలుగా, మండలాన్ని టాప్ మోడల్‌గా, దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలుగా మలిచి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అధికారులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ సలహాదారుల సహకారంతో గ్రామ బాధ్యతలు నిర్వహించి, ప్రజలకు నిజమైన సేవ చేయాలి. మీ బాధ్యత తీర్చిపెట్టి, గ్రామాల్ని స్వర్ణోత్సవాలకు చేర్చండి!


