తాను లోకాన్ని వీడినా, మరొకరికి దృష్టిని ప్రసరింపచేసిన అనసూర్య గారు – ధన్యజీవులు.
శివునిపల్లి (ఘనపురం) వాస్తవ్యులైన శ్రీమతి నూక అనసూర్య గారు ( 85 ) ఈ రోజు 25.10.2025 శనివారం ఉదయం మరణించినారు.
వారి అల్లుడు శ్రీ తెల్లాకుల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో – సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకొని,
నూక అనసూర్య గారి కుమారుడు శ్రీ నూక రమేష్, కుమార్తెలు పద్మ, రేవతి గార్లు మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రదానానికి సమ్మతించినారు.
L.V.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ , హైదరాబాద్ వారి టెక్నీషియన్ శ్రీ G.నరేందర్ గారు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రాలలోని రెండు కార్నియాలను సేకరించినారు.
శ్రీమతి నూక అనసూర్య గారు తమ నేత్రదానంతో, బంధుమిత్రులకు, తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినారు.
అంధుల జీవితాలలో వెలుగును ప్రసరింపజేసే, ఈ సమాజహిత కార్యక్రమంలో శివునిపల్లి *లయన్స్ క్లబ్* ప్రెసిడెంట్ గౌరిశెట్టి అనిల్ గారు, *సదాలోచన ఫౌండేషన్, వరంగల్* సభ్యులైన పార్సి నవీన్ కుమార్, పార్సి కమల్ కుమార్ గార్లు తమ వంతు సహకారాన్ని అందించారు.
🙏🙏


