నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు
వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి):
మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు – ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు – నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి): మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు – ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు – నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.