నేడు చిట్వేల్‌కు ఖాదీ చైర్మన్ కె.కె. చౌదరి
-ఎంపీటీసీ 3.0 కార్యక్రమానికి హాజరు, కూటమి నేతలతో భేటీ
చిట్వేల్, డిసెంబర్ 4: పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి శుక్రవారం (నేడు) చిట్వేల్ మండలంలో పర్యటించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ ఆదేశాల మేరకు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
-ముఖ్య కార్యక్రమాలు:
సమయం:ఉదయం 10:00 గంటలకు.
ప్రదేశం:చిట్వేలి జెడ్‌పీ హైస్కూల్.
కార్యక్రమం:ఇక్కడ నిర్వహిస్తున్న “మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే (ఎంపీటీసీ) 3.0″కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
-కూటమి నేతలతో భేటీ:
మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు చైర్మన్ కె.కె. చౌదరి చిట్వేలిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక తెదేపా, జనసేన, భాజపా (కూటమి) నాయకులతో సమావేశమై ప్రాంతీయ అంశాలు, పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నారు.


