నెల్లూరు, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి):
జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నెల్లూరు పోలీసులు ప్రజలతో కలిసి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక రవాణా, రోడ్డు ప్రమాదాలు, మహిళా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సామరస్యంగా జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చెడు ప్రవర్తన కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను డయల్ 112 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నెల్లూరు జిల్లా – గ్రామాల్లో అవగాహనతో నేర నివారణకు పూనిన పోలీసులు
నెల్లూరు, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి): జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నెల్లూరు పోలీసులు ప్రజలతో కలిసి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక రవాణా, రోడ్డు ప్రమాదాలు, మహిళా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సామరస్యంగా జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చెడు ప్రవర్తన కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను డయల్ 112 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

