నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) లో PGT, CRT గెస్ట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియామకానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
లింగముద్రం, కందుకూరు, సీతారామపురం, కలిగిరి KGBV హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు గంటకు రూ.250 చెల్లింపు అందజేస్తారని తెలిపారు.
ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అవకాశం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.


