Story highlights
- నెల్లూరు రూరల్, నవంబర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేదగిరి క్షేత్రంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
- అనంతరం ఉత్సవమూర్తులను పుష్పాలు, విశేష ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు.
- వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు గిరిప్రదక్షిణకు బయలుదేరారు.
నెల్లూరు రూరల్, నవంబర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేదగిరి క్షేత్రంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పుష్పాలు, విశేష ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు గిరిప్రదక్షిణకు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పాల్గొన్నారు.ఈ వేడుకలో ఆలయ చైర్మన్ అచ్యుతరెడ్డి, ఈవో గోపి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.