నెల్లూరు: సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో 98వ కార్యక్రమంగా “పాటల సవ్వడి” పేరిట సాంస్కృతిక సంగీత సభ ఈ శనివారం (12.04.2025) సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరు టౌన్ హాల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నెల్లూరు ప్రాంతానికి చెందిన 40 మంది ప్రముఖ మరియు యువ గాయకులు భారతీయ సినిమాల్లోని అద్భుతమైన గీతాలను ఆలపించనున్నారు. సంగీత ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
సంస్థ సేవలు, స్థానిక ప్రతిభా అభివృద్ధికి చేసిన కృషి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఒక సంగీత పండుగగా మారనుంది. సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు తప్పక హాజరై ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంకీర్తన కళా సమితి సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మీ హాజరును ఆతురతతో ఎదురుచూస్తున్నాం.

