నెల్లూరు, జనవరి (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి టేబుల్ క్యాలెండర్‌ను సంక్రాంతి సందర్బంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ కె. పద్మావతి గారు నెల్లూరులోని ఎస్పీ బంగ్లా వద్ద ఉదయం 9 గంటలకు ఆవిష్కరించారు. అనంతరం ఆమె భర్త, డిప్యూటీ డీఎంహెచ్వో రిటైర్డ్ డాక్టర్ విజయ్‌కుమార్ గారిని ఘనంగా సత్కరించారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ, జనరల్ సెక్రటరీ సుధాకర్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ పద్మావతి మరియు డాక్టర్ పొంగూరు నారాయణ గారు కేడర్ అభివృద్ధికి చేసిన సహాయాన్ని కొనియాడారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చేపట్టిన పారదర్శక విధానాల వల్ల ఆరోగ్యశాఖ గాడిలో పడిందని తెలిపారు.
20 సంవత్సరాలకు పైగా పదోన్నతులు లేకుండా సేవలందిస్తున్న అధికారులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, పీజీ డిప్లమో పూర్తి చేసిన సిబ్బందికి అవకాశాలు ఇవ్వాలని కోరారు. అసోసియేషన్ వివరించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని డాక్టర్ పద్మావతి హామీ ఇచ్చారు. జయప్రకాశ్, హరిప్రసాద్, ఆరోగ్య మేరీ, అరవ పరిమళ తదితరులు పాల్గొన్నారు.


