నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
చెంచుల సమస్యల పరిష్కారానికి చెంచుల చెంతకే వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అధికార యంత్రాంగం తో సహా నెల్లికల్ చెంచు
వాని తండా సందర్శన, తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తమ వద్దకే వచ్చినందుకు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపిన చెంచులు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సీరియస్ గా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం
నెల్లికల్ చెంచువాని తండాకు చెందిన ఆదెమ్మ ఒక పిటిషన్ ను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ దృవపత్రాలు లేనందున, తమ తండావాసులు అందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందడం లేదని పిటిషన్ లో ఉన్నది. ఈ విషయాన్ని
సావదానంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళా సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. వెంటనే నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుండూరు రఘువీర్ రెడ్డితో మాట్లాడి, చెంచుల సమస్యల పరిష్కారానికి నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్దామని అందుకు సమయం కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే అంగీకరించడంతో శుక్రవారం ఉదయమే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సహా శాసనసభ్యులు కలిసి నెల్లికల్ చెంచు తండాకి చేరుకున్నారు ఉదయమే తమ తండాకు వచ్చిన జిల్లా కలెక్టర్ఎ,మ్మెల్యేలను చూసి చెంచు ప్రజలు సంతోషంతో స్వాగతం పలికారు.

నెల్లికల్ తండా ను సందర్శించిన : ఎమ్మెల్యే , కలెక్టర్
నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) చెంచుల సమస్యల పరిష్కారానికి చెంచుల చెంతకే వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అధికార యంత్రాంగం తో సహా నెల్లికల్ చెంచు వాని తండా సందర్శన, తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తమ వద్దకే వచ్చినందుకు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపిన చెంచులు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సీరియస్ గా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ చెంచువాని తండాకు చెందిన ఆదెమ్మ ఒక పిటిషన్ ను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ దృవపత్రాలు లేనందున, తమ తండావాసులు అందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందడం లేదని పిటిషన్ లో ఉన్నది. ఈ విషయాన్ని సావదానంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళా సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. వెంటనే నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుండూరు రఘువీర్ రెడ్డితో మాట్లాడి, చెంచుల సమస్యల పరిష్కారానికి నెల్లికల్ చెంచువాని తండాకి వెళ్దామని అందుకు సమయం కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే అంగీకరించడంతో శుక్రవారం ఉదయమే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సహా శాసనసభ్యులు కలిసి నెల్లికల్ చెంచు తండాకి చేరుకున్నారు ఉదయమే తమ తండాకు వచ్చిన జిల్లా కలెక్టర్ఎ,మ్మెల్యేలను చూసి చెంచు ప్రజలు సంతోషంతో స్వాగతం పలికారు.

