


మనుబోలు (పున్నమి విలేకరి)18,అక్టోబర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు చరిత్రాత్మకంగా నిలిచిపోతాయని భాజపా మనుబోలు మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయా చట్టాల గురించి వివరించే కరపత్రాలను ఆదివారం ఆయన మండలకేంద్రంలో రైతులు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నచ్చిన ధరలు నిర్ణయించుకుని స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని పార్లమెంట్లో మరియు రాజ్యసభ లో అనుమతి పొందటం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థ ద్వారా కాకుండా రైతులు నేరుగా వారు పండించిన పంటలు వారే ధరలు నిర్ణయించి అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది, రైతులు ఆదాయం రెట్టింపు అవుతుంది అని చెప్పటం జరిగింది.ఈ పధకం లోని ముఖ్య సమాచారం కరపత్రాలు ద్వారా ప్రచురించి మండలంలోని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మనుబోలు మండల బిసి మోర్చా మండల అధ్యక్షుడుగా వీరంపల్లి. గ్రామానికి చెందిన రాచురు. వెంకయ్య ను మండల కమిటీ ఆద్వర్యంలో మండల అధ్యక్షుడు. ఓడూరు.శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోలా.శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇరగరాజు వెంకయ్య, ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మండల నాయకులు యనమల. శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

