చిట్వేలి మండలం కె.కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె వివాహం 17-08-2025 ఆదివారం నాడు లక్ష్మీపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా నూతన వధూవరులు హర్షవర్ధని రెడ్డమ్మ – చెన్నకేశవులు ను ఆశీర్వదించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


