Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జనసేన పార్టీ నాయకులు

Punnami Newsroom Published: Updated:
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జనసేన పార్టీ నాయకులు

దుత్తలూరు: దుత్తలూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా బి. మహేంద్ర నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుత్తలూరు జనసేన పార్టీ మండల కన్వీనర్ దుంపలగడ్డ రవికుమార్ ఎస్సై బి. మహేంద్రను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్సై బి. మహేంద్రతో దుంపలగడ్డ రవికుమార్ వివిధ అంశాలపై సంభాషించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు, మండలంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటాద్రి, హరి ప్రసాద్, ఉస్మాన్, నాగరాజు, కోనటి నవీన్ పాల్గొన్నారు.

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జనసేన పార్టీ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *