ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకడుగు వేయం..
నూతన ఎక్స్-రే పరికరాన్ని పరిశీలించిన దేవి రెడ్డి ప్రశాంత్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ): రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక టెక్నాలజీ కలిగిన నూతన ఎక్స్-రే పరికరాన్ని డాక్టర్ బృందం ఆహ్వానం మేరకు ఆసుపత్రికి చేరుకొని పరిశీలించడం జరిగినది, అలాగే ప్రజలకు మెరుగు వైద్యం, తగిన సౌకర్యాలు అందించడం కోసం ఎలాంటి కృషి కైనా వెనకాడకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికైనా వెనుకాడబోయే ప్రసక్తే లేదని, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ తో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఆధునిక సదుపాయాలు మౌలిక వసతులు కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు వైద్య బృందానికి తెలియజేశామని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ ప్రశాంత రెడ్డి మరియు బిజెపి సీనియర్ నాయకులు మణి తెలియజేశారు.


