ఏలూరు జిల్లా, నూజివీడు: పున్నమి ప్రతినిధి (అక్టోబర్02)
*చికెన్, మటన్, పంది మాంసం* *విక్రయాలు యధేచ్చగా* *జరుగుతున్నప్పటికీ అటువైపు* కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెబ్లీ సైతం గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. కానీ ఇక్కడ మాత్రం గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరగడాన్ని చూస్తే జాతి పితకు దేశంలో ఎంత ప్రాధాన్యత, గౌరవం ఉందో తెలుస్తోంది.
నూజివీడు పట్టణంలో బహిరంగంగానే మాంసం విక్రయాలు జరగడాన్ని ఖండిస్తున్న సామాజిక సేవా సంస్థలు.
మున్సిపల్ అధికారులు మౌనం వెనక రహస్యం ఏమిటో తెలియట్లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. మున్సిపల్ అధికారులు కనుసైగలలోనే మాంసం విక్రయాలు ప్రోత్సహిస్తున్నారని జరుగుతున్న ప్రచారం.

