విశాఖపట్నం , డిసెంబరు 9:
మాస్టర్ హోమియో వైద్యాలయం ద్వారా గతయాభై సంవత్సరాలుగా
నిస్వార్థంగా అందించినహోమియో సేవలు నిరుపమానవైవని,
తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన ఆయన ఒక మహత్తర వ్యక్తి అని జగద్గురుపీఠం జాతీయ సలహామండలి సభ్యులు సి. హెచ్. యస్. యన్. రాజు ( మచిలీపట్నం ) కొనియాడారు.
అక్కయ్యపాలెంలో గల మాస్టర్ హోమియో వైద్యాలయం ప్రాంగణంలో
ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ (జగద్గురుపీఠం ) సోదరబృందం నిర్వహించిన “డాక్టర్ కె. యస్. శాస్త్రి సంస్మరణ ” సభలో ఆయన ప్రసంగిస్తూ మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఆచరించిన ఆధ్యాత్మిక , సామాజిక సేవా కార్యక్రమాలను డాక్టర్ శాస్త్రి ఒక తపస్సుగా నిర్వహించారని , జగద్గురుపీఠం అధ్యక్షునిగా ఆయన విశేషమైన సేవలనందించారని రాజు వివరించారు.
*డాక్టర్ కె.యస్. శాస్త్రి కి ఘన నివాళి* ..
హోమియో సేవను యజ్ఞార్ధ కర్మగా మాస్టర్ ఇ. కె నిర్వర్తించారని , ఆయన అడుగుజాడలలో జీవిత ప్రయాణాన్ని సాగించి తరించిన పుణ్యమూర్తి డాక్టర్ శాస్త్రి అని “మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ ” ఛైర్మన్ ఎక్కిరాల అనంతకృష్ణ ప్రస్తుతించారు .
డా॥ శాస్త్రి జీవితంలో క్రమశిక్షణ, దీక్ష , సేవాతత్పరత , గురుభక్తి, సమర్పణాది విషయాలు స్పష్టంగా గోచరించేవని సంస్ధ భౌగోళిక అధ్యక్షుడు కె. గురుప్రసాద్ అన్నారు .హోమియో విజ్ఞానాన్ని ,
హోమియో వైద్య విధానాన్ని అందించడానికి డా॥ శాస్త్రి చేసిన కృషి చిరస్మరణీయమైనదని ట్రస్ట్ కార్యదర్శి బి. ఆర్.కె.రాజు అన్నారు . మాస్టర్ హోమియో వైద్యాలయానికి డాక్టర్ శాస్త్రి “అధిష్ఠాన దేవత” వంటివారని ,
హోమియో టీచింగ్ సెంటర్ నిర్వాహకునిగా,బాలభాను విద్యాలయం పూర్వ అధ్యక్షునిగా
డాక్టర్ శాస్త్రి చేసిన కృషి విశిష్టమైనదని , మాస్టర్ ఇ. కె వ్యాఖ్యానించిన హోమియో “ఆర్గనాన్ ” అనే గ్రంథాన్ని ఆంగ్లభాషలోనికి ఆయన అనువదించారని కులపతి బుక్ ట్రస్ట్ కార్యదర్శి డా॥ చింతలపాటి సత్యదేవ్ పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యులు అజ్జరపు శ్రీనివాస్ , బి. ఉషారాణి, పి. రవిశంకర్, బాలభాను విద్యాలయం పూర్వ ప్రిన్సిపాల్ వారణాసి పార్వతి, డాక్టర్ టి . జ్యోతిర్మయి, మాస్టర్ హోమియో వైద్యాలయ ప్రముఖ సేవకులు డా॥ డి. వి. భాస్కర రావు ,యం . హనుమంతరావు , డాక్టర్ శాస్త్రి తనయులు కె. శ్రీనివాస్, కె. వి. ప్రసాద్ (బెంగుళూరు),సి.హెచ్.నరసింహమూర్తి,
డాక్టర్ బి.వంశీకృష్ణ,ట్రస్ట్ సభ్యులు,
జనకులం విద్యాలయం పూర్వ విద్యార్థులు, తదితర ప్రభృతులు పాల్గొని, డాక్టర్ కె. యస్. శాస్త్రి కి సంస్మరణ సభలో ఘన నివాళులు అర్పించారు. మాస్టర్ ఇ. కె. నీరాజనంతో
కార్యక్రమం ముగిసింది.

