Sunday, 22 March 2026
  • Home  
  • నిరుపేదకు ఆర్థిక సహాయం చేసిన భోగినేని
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరుపేదకు ఆర్థిక సహాయం చేసిన భోగినేని

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ కన్వీనర్ ముత్తంశెట్టి చెన్నకేశవులు, మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), ఊర చెరువు నీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య, జడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ తోట ఏడుకొండలు, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జన సైనికులు చెన్నకేశవులు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు.

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎడమ కట్టి సుబ్రమణ్యం పరామర్శించి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగినేని కాశీ రావు మాట్లాడుతూ ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేద సీతారామపురం లో అందరికీ సుపరిచితుడని, చిన్న వయసులోనే కంటిచూపు కి సంబంధించిన ఇబ్బందులు రావడం తీవ్ర బాధని కలిగించిందన్నారు.బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ కన్వీనర్ ముత్తంశెట్టి చెన్నకేశవులు, మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), ఊర చెరువు నీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య, జడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ తోట ఏడుకొండలు, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జన సైనికులు చెన్నకేశవులు, వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.