Thursday, 5 February 2026
  • Home  
  • నిబద్ధతతో ప్రజాసేవకు జనసేన సిద్ధం – మధిర మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో పోటీ: జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ
- ఖమ్మం

నిబద్ధతతో ప్రజాసేవకు జనసేన సిద్ధం – మధిర మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో పోటీ: జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ

ఖమ్మం, జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) మధిర మున్సిపాలిటీలో నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ తెలిపారు. మధిర ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా చైతన్యవంతమైన మధిర ప్రాంతంలో ప్రస్తుతం రౌడీయిజం రాజ్యమేలుతోందని, శాంతిభద్రతలు సరిగా లేక గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే బలమైన స్థానిక నాయకత్వం మధిరలో ఇప్పటివరకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గత 20 సంవత్సరాలుగా మధిర పారిశ్రామిక అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉందని, వందల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు జరిగాయే తప్ప ప్రారంభోత్సవాలు లేవని విమర్శించారు. అలాగే మధిర కేంద్రానికి విజయవాడ, ఖమ్మం నుంచి సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం ప్రాంత అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. యువత, విద్యావేత్తలు, సామాజిక సేవలో ఆసక్తి ఉన్న వారికి జనసేన పార్టీ రాజకీయాల్లోకి రావడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను జనసేన పార్టీకి 50 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అన్ని వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మధిర జనసేన పార్టీ నాయకులు మోదుగు రమ్య, అనంత శివరామకృష్ణ, తాళ్లూరి డేవిడ్, అనుమొల నరేష్, మందడపు రామకృష్ణ, దీపకళ, సాయితేజ, పవన్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)

మధిర మున్సిపాలిటీలో నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ తెలిపారు. మధిర ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయంగా చైతన్యవంతమైన మధిర ప్రాంతంలో ప్రస్తుతం రౌడీయిజం రాజ్యమేలుతోందని, శాంతిభద్రతలు సరిగా లేక గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే బలమైన స్థానిక నాయకత్వం మధిరలో ఇప్పటివరకు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

గత 20 సంవత్సరాలుగా మధిర పారిశ్రామిక అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉందని, వందల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు జరిగాయే తప్ప ప్రారంభోత్సవాలు లేవని విమర్శించారు. అలాగే మధిర కేంద్రానికి విజయవాడ, ఖమ్మం నుంచి సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం ప్రాంత అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు.

యువత, విద్యావేత్తలు, సామాజిక సేవలో ఆసక్తి ఉన్న వారికి జనసేన పార్టీ రాజకీయాల్లోకి రావడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను జనసేన పార్టీకి 50 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అన్ని వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

ఈ సమావేశంలో మధిర జనసేన పార్టీ నాయకులు మోదుగు రమ్య, అనంత శివరామకృష్ణ, తాళ్లూరి డేవిడ్, అనుమొల నరేష్, మందడపు రామకృష్ణ, దీపకళ, సాయితేజ, పవన్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.