Sunday, 22 March 2026
  • Home  
  • నాగ్‌పూర్ వేదికగా భారత్ టీ20లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో తొలి గెలుపు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నాగ్‌పూర్ వేదికగా భారత్ టీ20లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో తొలి గెలుపు

నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో లభారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ 238 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు 84 పరుగులతో జట్టు స్కోరును భారీగా పెంచాడు. అతడికి తోడుగా రింకూ సింగ్ 44 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో చివర్లో వేగం పెంచాడు. భారత బ్యాట్స్‌మెన్ దూకుడైన ఆటతో న్యూజిలాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. భారత బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. సమష్టి జట్టు ప్రదర్శనతో భారత్ తొలి టీ20ను తన ఖాతాలో వేసుకుని సిరీస్‌కు శుభారంభం చేసింది. Uploaded Video:

నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో లభారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ 238 పరుగులు చేసింది.
భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు 84 పరుగులతో జట్టు స్కోరును భారీగా పెంచాడు. అతడికి తోడుగా రింకూ సింగ్ 44 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో చివర్లో వేగం పెంచాడు. భారత బ్యాట్స్‌మెన్ దూకుడైన ఆటతో న్యూజిలాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. భారత బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. సమష్టి జట్టు ప్రదర్శనతో భారత్ తొలి టీ20ను తన ఖాతాలో వేసుకుని సిరీస్‌కు శుభారంభం చేసింది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.