విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం
నాగుల చవితి సందర్భంగా నగర వాసుల సౌకర్యార్ధం శనివారం (25 – 10 – 2025) వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగుల చవితి పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. బీచ్ రోడ్ లోని వి ఎం ఆర్ డి ఎ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లలో ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అందరికీ నాగుల చవితి సందర్భంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు శుభాకాంక్షలు తెలిపారు.


