Sunday, 7 December 2025
  • Home  
  • నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్.
- E-పేపర్

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్.

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) జిల్లా ఉద్యాన అధికారిణి, సుభాషిని ఆదేశాల మేరకు రైల్వేకోడూరు మండల ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు రైల్వే కోడూరు మండలంలోని పలు బొప్పాయి నర్సిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి భాస్కర్ మాట్లాడుతూ నర్సరీ వ్యాపారులందరూ కూడా నర్సరీ యాక్ట్ 2010 నిబంధనలు ప్రకారము నర్సరీలను నిర్వహించి రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని కోడూరు ఉద్యాన అధికారి భాస్కర్ తెలియజేశారు. అదేవిధంగా మొక్కల కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్లలో తగు వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని, మొక్కలు కోనుగోలుకి సంబంధించి రైతులకు రసీదులు అందించాలని చిట్వేలు ఉద్యాన అధికారి లోకేష్ తెలియజేశారు. బొప్పాయి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కల్తీ జరగకుండా నర్సరీ నిర్వాహకులు విత్తనాలకు సంబంధించి రిజిస్టర్ లను నిర్వహించాలని కోడూరు మండల వ్యవసాయ అధికారి, సందీప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ యజమానులు, రైతులు, రాఘవరాజపురం మరియు అనంతరాజుపేట ఉద్యాన సహాయకులు సుధీర్ కుమార్ వర్మ మరియు హరిబాబు పాల్గొన్నారు.

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి

రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )
జిల్లా ఉద్యాన అధికారిణి, సుభాషిని ఆదేశాల మేరకు రైల్వేకోడూరు మండల ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు రైల్వే కోడూరు మండలంలోని పలు బొప్పాయి నర్సిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి భాస్కర్ మాట్లాడుతూ నర్సరీ వ్యాపారులందరూ కూడా నర్సరీ యాక్ట్ 2010 నిబంధనలు ప్రకారము నర్సరీలను నిర్వహించి రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని కోడూరు ఉద్యాన అధికారి భాస్కర్ తెలియజేశారు. అదేవిధంగా మొక్కల కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్లలో తగు వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని, మొక్కలు కోనుగోలుకి సంబంధించి రైతులకు రసీదులు అందించాలని చిట్వేలు ఉద్యాన అధికారి లోకేష్ తెలియజేశారు. బొప్పాయి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కల్తీ జరగకుండా నర్సరీ నిర్వాహకులు విత్తనాలకు సంబంధించి రిజిస్టర్ లను నిర్వహించాలని కోడూరు మండల వ్యవసాయ అధికారి, సందీప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ యజమానులు, రైతులు, రాఘవరాజపురం మరియు అనంతరాజుపేట ఉద్యాన సహాయకులు సుధీర్ కుమార్ వర్మ మరియు హరిబాబు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.