*చివరి రోజున ఆర్టీసీ బస్సులో తిరిగిన సజ్జనార్!*
పున్నమి ప్రతినిధి:
హైదరాబాద్:సెప్టెంబర్ 30
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్, బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కమాండో,అండ్ కంట్రోల్ యూనిట్ లో సీవీ ఆనంద్, నుండి సజ్జనార్, బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు టీజీ ఆర్టీసీ ఎండిగా ఉన్న ఆయనను ప్రభుత్వం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఐపీఎస్ ప్రజా రవాణాపై తన అనుబం ధాన్ని వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిం చారు. సాధారణ ప్రయాణికుడిలా బస్టాప్లో బస్సెక్కి లక్డీకాపుల్ – టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్‌భవన్ వరకు 113 I/M మెహదీపట్నం రూట్ బస్సులో ప్రయాణిం చారు.స్వయంగా ఆయనే తన మొబైల్ ఫోన్తో యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద సొంత ఖర్చు తో టికెట్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా బస్సులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్ ఆర్టీసీలో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం, ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా ప్రభుత్వం నియమించింది..
ప్రయాణాలు ఆగిపోవచ్చు, కానీ ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారని, ఇప్పుడు తనకు బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చింది అని సజ్జనార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లు జీవనాడి అని అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి, ప్రయాణికుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన అదనపు డీజీపీ హోదాలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సెప్టెంబరు 29 వరకు పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్పీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2008లో వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్ విషయంలో కీలకంగా వ్యవహారించారు. 2019 శంషాబాద్ దిశ ఎన్కౌంటర్‌లో సజ్జనార్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పుడు సజ్జనార్పై ప్రజలు పూల వర్షం కురిపించారు.


