నగరంలో గల ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు సకాలంలో చెల్లించండి .
– నగరంలో భవన యజమానులకు విజ్ఞప్తి చేసిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను, నీటి చార్జీలను సకాలంలో చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి భవన యజమానులు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని భవన యజమానులు, ఆస్తి ఖాళీ స్థలాల పన్నులను 2025-26 ఆర్ధిక సంవత్సరం ముగుయుచున్నందున మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నకు చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయిలు, ఖాళీస్థలము పన్ను బకాయిలు, మంచి నీటి కుళాయి చార్జీల బకాయిలును వెంటనే చెల్లించాలని కమిషనర్ తెలిపారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని యెడల బకాయిదారులు ఆస్తుల జప్తులకు గురి కాగలరని కమిషనర్ తెలిపారు. కావున భవన యజమానులందరూ తక్షణమే మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కు చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీస్థలము పన్ను, మంచి నీటి కుళాయి చార్జీలును సకాలములో చెల్లించి, వడ్డీలకు గురికాకుండా పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలని భవన యజమానుదారులకు కమిషనర్ తెలిపారు.


