నకిరేకల్ ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) :
ఆగష్టు మొదటి వారంలో కురిసిన వర్షానికి నల్గొండ జిల్లా నకిరేకల్ లోని మినిస్టేడియం గత మూడురోజుల నుండి నీటిలో మునిగి ఉన్నది. ఆనీటిని మళ్లీంచకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని ప్రతిరోజూ వచ్చే వాకర్స్ మండిపడుతున్నారు.
చిన్నపిల్లలకి ఆడుకోవడానికి తగిన స్థలం
లేక ఇబ్బంది పడుతున్నారు. నీరు నిలువ ఉండడంవల్ల దోమలకి ఆవాసంగా ఉండి, డెంగ్యూ, మలేరియా, వంటి రోగాలు రావడానికి అవకాశం ఉన్నది.కావున మినిస్టేడియంలోని నీటిని బైటకు వెళ్లే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


